09-05-2025 12:00:00 AM
ఇల్లెందు, మే 8 : సింగరేణి డైరెక్టర్ కే. వెంకటేశ్వర్లు గురువారం ఇల్లందు ఏరియా లోని కోయగూడెం, జెకె-5, ఓ.సి.లలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన పని స్థలాలను సందర్శించి అక్కడ జరుగుచున్న పనులను పరిశీలించారు.
రోజు వారి బొగ్గు ఉత్పత్తి , రవాణా, ఓబి బ్లాస్టింగ్, లోడింగ్ పనులను జి.యం వి.కృష్ణయ్య ను అడిగి తెలుసుకున్నారు. తరువాత డైరెక్టర్ (పి.పి) కే. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి రవాణా రోజు వారి లక్ష్యాలను అధికమించాలని, బొగ్గు ఉత్పత్తి, రవాణాకు ఎటువంటి ఆటంకములు కలుగకుండా ముందస్తు జాగ్రతలు తీసుకోవాలన్నారు.
ఉపరితల గను ల్లో ఎండా తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉద్యోగులకు రక్షణ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా రక్షణతో కూడిన ఉత్పత్తి తీయాలని, సంస్థ నిర్దేశించిన వార్షిక లక్ష్యాలను అధిగమి0చాలన్నారు.
ఈ కార్యక్రమంలో పి.ఓ కే.ఓ.సి. గోవిందరావు, జే.కే ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎ.కృష్ణ మోహన్ రావు, డి.జి.యం. సివిల్ రవికుమార్, మేనేజర్ పూర్ణచందర్, పి.శ్రీనివాస్,పి.ఇ శివ శంక ర్, క్యాలిటీ మేనేజర్ కె. రామదాస్, సర్వే అధికారి నాగేశ్వర్ రావు సెక్యూరిటీ అధికారి అంజి రెడ్డి, సీనియర్ పి.ఓ. వి.అజయ్, ఇతర అధికారులు, ఉద్యుగులు పాల్గొన్నారు.