15 March, 2026 | 6:01 PM

Breaking News

మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి పాజిటివ్   •  

గ్యాంగ్‌ల మధ్య విభేదాలు.. మాజీ కానిస్టేబుల్ దారుణ హత్య

09-11-2024 10:41 AM

హైదరాబాద్: మాజీ కానిస్టేబుల్ ఈశ్వర్ దారుణ హత్యకు గురయ్యాడు. కొన్నేళ్లుగా ఈశ్వర్ పిక్ పాకెటింగ్ కు పాల్పడుతున్నాడు. దీంతో అధికారులు ఈశ్వర్ ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఉద్యోగం పోవడంతో ఈశ్వర్ చెన్నైకి పారిపోయాడు. చెన్నైలో మట్కా, పిక్ పాకెటింగ్ చేస్తున్నాడు. ప్రత్యర్థులు సెటిల్ మెంట్ కు హైదరాబాద్ కు పిలిపించారు. మీర్ పేటలో ఈశ్వర్ పై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఈశ్వర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈశ్వర్ పై దాడికి గ్యాంగ్ ల మధ్య విభేదాలే కారణమని పోలీసుల భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.