calender_icon.png 7 August, 2025 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్ను మూత

06-08-2025 12:12:35 AM

  1. ఢిల్లీలోని లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  2. ఒకసారి ఎమ్మెల్యే.. మూడుసార్లు ఎంపీగా ఎన్నిక
  3. ఐదు రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేసిన సత్యపాల్ మాలిక్

న్యూఢిల్లీ, ఆగస్టు 5: జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలోని రామ్ మనో హర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొం దుతూ మంగళవారం మధ్యాహ్నం 1 గం టల సమయంలో తుదిశ్వాస విడిచారు. 2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్ 30 వరకు జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా పనిచేశారు.

ఆయన హయాంలోనే ఆర్టికల్ 370 రద్దు జరిగింది. 1946, జూలై 24న అప్పటి బ్రిటీష్ ఫ్రావిన్స్‌లోని మీరట్‌లో సత్యపాల్ మాలిక్ జన్మించారు. 1960వ సంవత్సరంలో సత్యపాల్ మాలిక్ రాజకీయ ప్రస్థా నం మొదలైంది. స్టూడెంట్ లీడర్‌గా పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన సత్యపాల్ 1974లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బాఘ్ పట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఆ తర్వాత 1980 మధ్య రెం డుసార్లు రాజ్యసభకు, 1989 లోక్‌సభ ఎన్నికల్లో జనతాదళ్ తరఫు న బరిలోకి దిగిన సత్యపాల్ అలీఘర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. కేంద్ర పార్లమెంట రీ వ్యవహారాలు, పర్యాటక శాఖ సహాయమ ంత్రిగా విధులు నిర్వర్తించారు. బీహార్, ఒడి శా, జమ్మూ క శ్మీర్, గోవా, మేఘాలయా గ వర్నర్‌గా  సత్యపాల్ మాలిక్ పనిచేశారు. 

అవినీతి ఆరోపణలు.. సీబీఐ ఛార్జిషీటు

జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా సత్యపాల్ మా లిక్ పని చేస్తున్న సమయంలో ఒక పవ ర్ ప్రాజెక్ట్ టెండర్ల ప్రకియలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. సివిల్ వర్క్స్ కో సం పటేల్ ఇంజినీరింగ్ సంస్థకు చె ందిన ఫై ల్‌ను ఆమోదించేందుకు రూ. 300 కోట్లు ల ంచం తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో సత్యపాల్ మాలిక్‌పై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఇటీవల ఆయన నివాసా ల్లో సీబీఐ సోదాలు జరిపింది.