calender_icon.png 10 August, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజమైన భారతీయుడెవరనేది కోర్టులు నిర్ణయించలేవు

06-08-2025 12:10:20 AM

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా

న్యూఢిల్లీ, ఆగస్టు 5: నిజమైన భారతీయుడు ఎవరనేది కోర్టులు కానీ.. న్యాయ మూర్తులు కానీ నిర్ణయించలేరని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ స్పష్టం చేశారు. భారత జోడో యాత్ర సమయంలో సైన్యం పై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మందలించిన సంగతి తెలిసిందే. ప్రియాంక మాట్లాడుతూ.. ‘న్యాయవ్యవస్థపై నాకు పూర్తి గౌరవం ఉంది. అయితే పౌరుల దేశభక్తిని నిర్ధారించడం వారి పని కాదు.

రాహుల్ గాంధీ భారత భ ద్రతా దళాలలను ఎంతో గౌరవిసారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఆయనకు ఉంది. ఆర్మీని ఎంతో గౌరవిస్తారు’ అని వెల్లడించారు. రాహుల్ వ్యాఖ్యలు సరైనవే నంటూ ఇండియా కూటమి అభిప్రాయపడి ంది. ‘రాజకీయ పార్టీల ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధంగా న్యాయస్థానం అసా ధా రణ వ్యాఖ్యలు చేసింది. దీన్ని అన్ని పార్టీల నేతలు అంగీకరించారు’ అని పేర్కొంది.