06-08-2025 12:15:11 AM
వాషింగ్టన్/న్యూఢిల్లీ, ఆగస్టు 5: భారత్‌పై సుంకాల పెంపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. ఇప్పటికే భారత్‌పై 25 శాతం సుంకాలతో పాటు అదనపు పెనాల్టీ విధించిన ట్రంప్.. తాజాగా భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. వాణిజ్యం విషయంలో భారత్ మంచి భాగస్వా మి కాదని.. వారు మాతో చాలా వ్యాపారం చేస్తున్నప్పటికీ.. తాము భారత్‌తో తక్కువ వ్యాపారమే చేస్తున్నామని తెలిపారు.
సీఎన్‌బీసీ ఇంటర్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘రష్యా నుంచి భారత్ భారీ స్థాయిలో చమురును కొనుగోలు చేస్తున్నారు. తద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తున్నారు. వాణిజ్యం విషయంలో భారత్ మంచి భాగస్వామి కాదు. ఎందుకంటే మాతో వాళ్లు చాలా వ్యా పారం చేస్తున్నప్పటికీ.. మేము వాళ్లతో ఆ స్థాయిలో చేయడం లేదు. కాబట్టే 25 శాతం సుంకాలు విధించాం.. రానున్న 24 గంటల్లో దీన్ని గణనీయంగా పెంచబోతున్నాం’ అని పేర్కొన్నారు.
బెదిరింపులు తగదు: జై శంకర్
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తు న్న భారత్‌పై సుంకాలను మరింత పెంచుతానంటూ ట్రంప్ బెదిరింపులకు పాల్పడటంపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందించారు. అమెరికా సుంకాలపై పరోక్ష విమర్శ లు చేశారు. ప్రస్తుతం మనం సంక్లిష్టమైన, అనిశ్చితి కాలంలో జీవిస్తున్నామన్నారు. ఇ లాంటి పరిస్థితుల్లో పారదర్శకమైన వ్యవస్థ అవసరమని తెలిపారు.
అంతేకానీ కొంతమందిపై ఒకరి ఆధిపత్య ధోరణి ఉండకూడ దని పేర్కొన్నారు. ఉక్రెయిన్ ఘర్షణ అనంతరం అంతర్జాతీయ విపణిలో తలెత్తిన పరి స్థితుల వల్లే దేశీయ ఇంధన అవసరాలను తీ ర్చుకోవడానికి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని భారత్ స్పష్టం చేసింది.
భాగస్వాముల ఎంపిక మా హక్కు: రష్యా
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే భారత్‌పై సుంకాలు పెంచుతామని బెదిరించిన ట్రంప్‌పై రష్యా మండిపడింది. సార్వ భౌమ దేశాలకు తమ వాణిజ్య భాగస్వాములను సొంతంగా ఎంచుకునే హక్కు ఉంటుం దని అమెరికాకు స్పష్టం చేసింది. భారత్‌పై ట్రంప్ చేస్తున్న బెదిరింపులు అసమర్థమైనవని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ విమ ర్శించారు.