కలెక్టర్, ఎస్పీలను కలిసిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే
19-09-2025 05:37 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రలను శుక్రవారం వారి కార్యాలయాలలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే కలిసి జుక్కల్ నియోజకవర్గ సమస్యలపై చర్చించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న వాటి కి మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ ను కోరారు. రైతులకు పంట నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వం నుంచి నష్టపరి హారం అందించి ఆదుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్, ఎస్పి రాజేష్ చంద్రలను వేర్వేరుగా కలిసి సమస్యలను వివరించారు. సానుకూలంగా స్పందించినట్లు మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే తెలిపారు.




