calender_icon.png 19 September, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాన్స్ జెండర్లకు చీరల పంపిణీ

19-09-2025 05:33:59 PM

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి 

కామారెడ్డి,(విజయక్రాంతి): బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో శుక్రవారం కామారెడ్డిలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ట్రాన్స్ జెండర్ లకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 20 మంది ప్రాన్స్ జెండర్లకు బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా చీరలను అందించినట్లు తెలిపారు. ఆడపడుచులకు బతుకమ్మ పండుగ ఎంతో ముఖ్య పండుగ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందని తెలిపారు. ట్రాన్స్ జెండర్లకు తన సొంత డబ్బులతో చీరలను పంపిణీ చేసినట్లు  తెలిపారు.