19-09-2025 05:46:52 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని నందిగుండం దుర్గామాత ఆలయంలో ఈనెల 22 నుంచి దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు జగన్మోహన్ రెడ్డి ఆలయ వ్యవస్థాపకులు వెంకటాచారి తెలిపారు. 11 రోజులపాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా వివిధ పూజా కార్యక్రమాలు భజన సంకీర్తనలు మాలాధారణ అన్నదానం కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కృష్ణమూర్తి పూదరి నరహరి విలాస్ తదితరులు పాల్గొన్నారు.