calender_icon.png 20 January, 2026 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేయర్ పీఠంపై మాజీల చూపు

20-01-2026 12:00:00 AM

అనుకూల డివిజన్లపై నజర్

కరీంనగర్, జనవరి 19 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ పీఠం బి సి జనరల్ కు రిజర్వ్ కావడంతో ఆయా పార్టీల్లో ఉన్న మాజీలు ఆశలు పెంచుకున్నారు. బి ఆర్ ఎస్ నుండి మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్ర రాజు, బి ఆర్ ఎస్ నగర అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ మేయర్ స్వరూపారాణి భర్త చల్ల హరిశంకర్ తో పాటు తా జా మాజీ కార్పొరేటర్ లు ఆశలు పెంచుకున్నారు. బిజెపి నుండి మాజీ మేయర్ డి శంకర్, మాజీ డిప్యూటీ మేయర్ గుగిల్లపు రమేష్, మాజీ ఎం పి పి వాసాల రమేష్ తో పాటు మాజీ కార్పొరేటర్ లు లైన్ లో ఉన్నారు.

అధికార కాంగ్రెస్ పార్టీ నుండి మా జీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, మాజీ కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, ఆకుల ప్రకాష్, మాచర్ల ప్రసాద్ , మాజీ డిప్యూటీ మేయర్, ఎం ఐ ఎం నా యకుడు మహమ్మద్ అబ్బాస్ షమీలతో పాటు కొత్తవారు ఆశతో పోటీ చేసేందుకు సమాయత్తమయ్యారు. తమ డివిజన్లు మ హిళలకు రిజర్వ్ కావడంతో కొందరు ఖంగుతిన్నారు. ఓ వైపు బీసీ జనరల్ అయిన మే యర్ పదవి ఊరిస్తుంటే.. విధిలేక అవకాశం ఉన్న సమీప డివిజన్లపై రిజర్వేషన్ వచ్చిన ఆ శావహులు నజర్ పెట్టారు. పాలకవర్గం పదవీకాలం ముగిసిన ఏడాదికాలం నుంచి మే యర్ రేసులో ఫలానా నేతలున్నారనే ప్రచా రం ఉంది.

తాజాగా మేయర్ పీఠం బీసీ జనరల్ కు కేటాయించడంతో పోటీ కాస్త తగ్గిం ది. ఒక్కసారిగా బీసీ నేతలు తెర పైకి వచ్చా రు. మేయర్ పీఠం అనుకూలంగా వచ్చినప్పటికీ, తాము పోటీచేసే డివిజన్లు అనుకూలం గా లేకపోవడం ఇప్పుడు వారికి సమస్యగా మారింది. తమ పాత డివిజన్లు మహిళలు రిజర్వ్ కావడంతో స్వయంగా పోటీచేసే అవకాశం లేకుండా పోవడంతో పక్క డివిజన్లలో ఓటర్ల ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. తమ డివిజన్ల వైపు వీరు చూస్తుండటంతో ఆయా డివిజన్ల నుండి పోటీకి సిద్ధమైన వారిలో ఆందోళన మొదలయింది. ఆయా పార్టీలు ఎవరికీ టికేట్లు ఇస్తారో, మాజీలకు అదృష్టం వరిస్తుందో లేదో చూడాలి.