calender_icon.png 7 October, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంబీబీఎస్ సీటు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని సన్మానించిన మాజీ మంత్రి

07-10-2025 12:00:00 AM

జహీరాబాద్, అక్టోబరు 6 :తెలంగాణ మై నారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివిన విద్యార్థి ఎంబిబిఎస్ సీటు సాధించారు. జ హీరాబాద్ మండలం బూచనేర్లిలో గల ఏజెన్సీల్ పాఠశాలలో చదివి ఎంబిబిఎస్ సీటు సాధించడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఝరాసంగం మండలం బోపన్ పల్లి గ్రామానికి చెందిన సయ్యద్ కుమార్తె ఫిర్దోస్ నీట్ లో ఉత్తీర్ణతై సిద్దిపేటలోని సురభి మెడికల్ కాలేజీలో ఉచితంగా సీటు సాధించారు. సోమవారం మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విద్యార్థిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జహీ రాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఝరాసం గం మండల బిఆర్‌ఎస్ అధ్యక్షుడు మా చ్నూర్ వెంకటేశం, బీఆర్‌ఎస్ నాయకులు నాగన్న పాల్గొన్నారు.