calender_icon.png 7 October, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్ ఐడీ కార్డులను ఎలా పంచుతారు?

07-10-2025 12:00:00 AM

-కాంగ్రెస్ నేత నవీన్‌యాదవ్‌పై చర్యలు తీసుకోవాలి

-బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు  

హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ నేతలు ఓటర్ ఐడీ కార్డులు పంపిణీ దుకాణం పెట్టుకున్నారని, ఓటర్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ పేరుతో కార్డులు పంచుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. ఎన్నికల కమిషన్ చేతు ల్లోకి రావాల్సిన ఓటర్ కార్డులు, కాంగ్రెస్ నేతల చేతుల్లోకి ఎట్లా వెళ్లాయని  ప్రశ్నించా రు. బహిరంగంగా ఓటర్ కార్డులను పంచుతుంటే ఎన్నికల కమిషన్ మాట్లాడదు, కమిషనర్లు మాట్లాడటం లేదన్నారు.

సోమవా రం ఎన్నికల కమిషన్‌కు ఎంపీ రఘునందన్‌రావు ఫిర్యాదు చేశారు. కొత్త ఓటర్ కార్డులను  పంచుతున్న నవీన్ యాదవ్ పోటీకి ఎట్లా అర్హుడు  అవుతారని నిలదీశారు.   ఓట్ల సరి చేస్తామంటే గగ్గోలు పెడుతున్న మేధావులు ఇట్లాంటి వాటి మీదా స్పందించాలి. సరిచేస్తామంటే ఓట్ల చోరీ అంటున్నారు, ఇది ఐడీ కా ర్డుల చోరీ నా..? అని ఎంపీ నిలదీశారు. ఓటర్ ఐడి కార్డులను పంపిణి చేసిన నవీన్ యాదవ్‌పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని  రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.