calender_icon.png 7 October, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మారిన నేతల రాతలు!

07-10-2025 12:00:00 AM

  1. ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లిన రొటేషన్ ప్రక్రియ
  2. అనుకూలమైన రిజర్వేషన్‌లు రాక నిరాశలో కీలక నాయకులు
  3. రాజకీయ భవిష్యత్తుపై నెలకొన్న అయోమయం..
  4. కొత్త వారి రంగప్రవేశం.. టికెట్ల కోసం తాపత్రయం
  5. జిల్లాలో మారనున్న రాజకీయ ముఖ చిత్రం

ఆదిలాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మండలానికి చెందిన అధికార పార్టీ నాయకుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయం నుంచి ప్రజల్లో ఉంటూ.... రానున్న రోజుల్లో జడ్పీటీసీగా బరి లో ఉండాలని భావించారు. ఆయన మండలం పపరిధిలో నిత్యం ప్రజలతో మమేకమై ఉంటూ పోటిపై ఆసక్తి చూపించారు. పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి మరింత కష్టపడ్డారు. తీరా ఆ మండలం ఆయన కు రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.

ఎంపీపీ అవుదా మని భావించినా ఎంపీటీసీ స్థానం కూడా అనుకూలంగా రాలేదు. ఇలాంటి పరిస్థితిని జిల్లాలో అనేక మంది నాయకులకు ఎదుర్కొంటున్నారు. తొలి నుంచి స్థానిక సంస్థల కోసం ఎదురుచూసి బరిలో ఉండాలని భావించిన అనేక మంది నాయకుల పరిస్థితి రిజర్వేషన్ ల ఖరారు తో వారి తల రాతలు తలకిందులుగా మారింది. ప్రస్తుతం ఎక్కడా అవకాశం లేకపోవడంతో వారి రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఐదేళ్లళ్ల పాటు పదవులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొనుంది. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు రొటేషన్ పద్ధతి అనుసరించడంతో రిజర్వేషన్లు మారాయి. దీంతో గతంలో ఉన్న రిజరేవష న్లు మారడంతో ఇది వరకు పదవుల్లో ఉండి.. మళ్లీ పోటీ చేయాలని భావించిన, అనేక మం దికి తాజాగా ఎన్నికల్లో అవకాశం లేకుండా పోయింది. మరోవైపు జిల్లాలో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం దక్కిందనే ప్రచారం జరుగుతోంది.

మారిన జడ్పీ పీఠం...

జడ్పీటీసీలుగా గెలుపొంది చైర్మెన్ గిరిని సొంతం చేసుకోవాలని భావించిన కొందరు నాయకులకు ఈ పదవులు దక్కకుండాపోయాయి. తాజాగా జడ్పీ అధ్యక్ష స్థానాలకు సైతం రిజర్వేషన్లు మారిపోయాయి. గతంలో ఆదిలాబాద్ జడ్పీ అధ్యక్ష స్థానం ఎస్టీ జనరల్ కు కేటాయించగా.. ఈ సారి జనరల్ మహిళకు దక్కింది. దీంతో గతంలో ఉన్న చైర్మెన్ లకు మరోసారి అవకాశం లేకపోగా.. జడ్పీ పీఠం కన్నేసిన ఆయా పార్టీలకు చెందిన కొందరు కీలక నాయకులకు సైతం అవకాశం లేకుండా పోయిం ది. తాజాగా జడ్పీ పీఠంపై కొత్త వారు కొలువు దీరనున్నారు. దీంతో రిజర్వేషన్ అనుకూలంగా వచ్చిన నాయకు లు మాత్రం జడ్పీ పీఠం దక్కించుకోవాలని తాపత్రయపడుతున్నారు.

అధిక భాగం కొత్త వారే పోటీ..

జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించడం.. పాత నాయకులకు కలిసిరాకపోవడంతో ఆ స్థానా ల్లో కొత్త వారు రానున్నారు. ఇప్పటికే ఆయా ప్రధాన పార్టీల్లో ఉన్న కింది స్థాయి నాయకులు, రిజర్వేషన్ కలిసివచ్చిన సామాజిక వర్గాలకు చెందిన వారు పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. టికెట్ల కోసం ఆ యా పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, కీలక నాయకుల వద్దకు పరుగులు పెడుతున్నారు.

తమకు టికెట్లు కేటాయించాలని కోరుతున్నారు. దీంతో రానున్న ఎన్న్నికల్లో దాదాపు అధిక భాగం మంది కొత్త వారే పోటీ చేయనున్నారు. కొందరు వివిధ ఉద్యోగాలు.. వ్యాపారులు చేసుకుంటున్న వారు సైతం రిజర్వేషన్లు అనుకూలించడంతో రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో జడ్పిటీసి, ఎంపీపీలు, సర్పంచ్లుగా కొత్తవారు రానుండటంతో రాజకీయ ముఖ చిత్రం ఆసక్తికరంగా మారనుంది.