calender_icon.png 14 September, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంత కష్టం ఎప్పుడూ లేదు: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

14-09-2025 11:06:01 AM

యూరియా కోసం క్యూలైన్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ 

మహబూబాబాద్ (విజయక్రాంతి): యూరియా కోసం ఇంత కష్టం ఎప్పుడు పడలేదని, తనకు ఐదున్నర ఎకరాల భూమి ఉన్నా ఇప్పటివరకు ఒక్క బస్తా యూరియా ఇవ్వలేదని, తమ కుటుంబ సభ్యులను పంపించినా ఇవ్వకపోవడంతో తానే స్వయంగా యూరియా పరిస్థితి ఏమిటి అని తెలుసుకోవడానికి స్వయంగా వచ్చినట్లు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Former Minister Satyavathi Rathod) చెప్పారు. ఆదివారం ఉదయం మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు సొసైటీ వద్దకు వచ్చిన మాజీ మంత్రి క్యూ లైన్ లో నిలబడి ఒక బస్తా యూరియా టోకెన్ తీసుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) నాయకత్వంలో పదేండ్ల కాలంలో ఎన్నడూ కూడా రైతులకు ఎలాంటి కష్టం కలగలేదని చెప్పారు.

యూరియా కొరతపై రాష్ట్రంపై కేంద్రం, కేంద్రంపై రాష్ట్రం పరస్పర ఆరోపణలు చేసుకోవడం తప్ప రైతుల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, రాష్ట్రంలో వ్యవసాయ రంగమే అగ్రగామిగా నిలుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పంటల సాగు కు అవసరమైన ఎరువులను, విత్తనాలను అందుబాటులో ఉంచకుండా విఫలమైందని విమర్శించారు.