calender_icon.png 14 September, 2025 | 1:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుపతిలో తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు

14-09-2025 11:53:00 AM

హైదరాబాద్: తిరుపతిలో తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు ఆదివారం ప్రారంభమైంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Lok Sabha Speaker Om Birla) నేతృత్వంలో 'వికాసిత్ భారత్ కు మహిళల నాయకత్వం' అనే నినాదంతో రెండు రోజులపాటు ఈ సదస్సును నిర్వహించనున్నారు. సాంకేతిక విప్లవంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలే అజెండాగా.. చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధులకు ఎదురవుతున్న ఇబ్బందులు.. అలాగే సవాళ్లను అధిగమించడంలో మహిళా సాధికారత పాత్రపై సదస్సులో చర్చ నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు,  డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, మంత్రి పయ్యావుల కేశవ్, పార్లమెంట్ కమిటీ చైర్పర్సన్ దగ్గుబాటి పురందేశ్వరితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు.