14-09-2025 10:58:24 AM
భారీగా హాజరైన చిన్నారులు..
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రం శ్రీ హనుమాన్ దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం 30వ వారం ఘనంగా జరిగింది. గత 29 వారాలుగా దేవాలయంలో గ్రామ పెద్దలు, విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, హిందు వాహిని కార్యకర్తలు సామూహిక హనుమాన్ చాలీసా పరాయణం నిర్వహిస్తున్నారు. హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు శ్లోకాలు ,పద్యాలు ,దేశభక్తి గీతాలు చిన్నారులు ఆలపించారు. జైశ్రీరామ్..రామలక్ష్మణ జానకి... జై బోలో హనుమాన్ కి... అంటూ చిన్నారులు, భక్తులు చేసిన నినాదాలతో పెద్దముల్ గ్రామం మారుమ్రోగింది.