14-09-2025 12:42:49 PM
హైదరాబాద్: జాతీయ మహిళా సాధికారత సదస్సుకు దేశం నలువైపుల నుంచి మహిళలు వచ్చారని.. భారత్ లో మహిళల సాధికారత కోసం కేంద్రం అనేక పథకాలు తీసుకువచ్చిందని మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavula Keshav) సదస్సులో పేర్కొన్నారు. బేటి బచావో-బేటి పడావో, మహిళా సమ్మాన్ నిధి సహా అనేక పథకాలు తీసుకొచ్చామని.. 10 కోట్లకు పైగా మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరారని.. సామాజిక అడ్డంకులను అధిగమించి అనేకమంది మహిళలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. మహిళల ఆర్థిక, విద్య, రాజకీయ సమానత్వం కోసం పోరాడుతున్నామని అన్నారు. మహిళల అభివృద్దికి అనేక కార్యక్రమాలు.. అలాగే బాలికల విద్య, మహిళల సంరక్షణకు కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.