16-02-2026 01:06:35 AM
పెబ్బేరు పిబ్రవరి 15: పెబ్బేరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో ఓడిన కౌన్సిలర్ అభ్యర్థులను మాజీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయిన అభ్యర్థులను కలుసుకుని ధైర్యం చెప్పడంతో పాటు ప్రజాసేవలో ఓటమి,విజయాలు సహజమని,పార్టీ బలోపేతం కోసం మరింత కృషి చేయాలని సూచించారు.
అలాగే రెండేళ్లలో జంబ్లీ ఎన్నికలు వస్తాయని వచ్చేది రైతు ప్రభుత్వమేనని ఓడిన ప్రతి అభ్యర్థి కి పార్టీ అండగా ఉంటుందని, సమూచిత స్థానం కల్పిస్తామనిప్రజల కోసం పనిచేసే మనసు ఉంటే ఓటమి మనలను ఆపలేదు.ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకునే దిశగా ముందుకు సాగాలని అన్నారు. అనంతరం పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేస్తే భవిష్యత్తులో మరింత మంచి ఫలితాలు సాధించవచ్చని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.కార్యక్రమం లో మండల పట్టణ అధ్యక్షులు వనం రాములు, దిలీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రెస్వామి, వడ్డే రమేష్, తదితర నాయకులు పాల్గొన్నారు