calender_icon.png 18 January, 2026 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామేశ్వర్‌పల్లిలో మురుగు కాలువల శుభ్రత పనులు

18-01-2026 02:20:30 PM

భిక్కనూర్, జనవరి 18,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లి గ్రామంలోని వైకుంఠధామం పరిసర ప్రాంతాల్లో ఉన్న మురుగు కాలువలను జెసిబి సహాయంతో శుభ్రం చేయించారు. గ్రామంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడడం లక్ష్యంగా ఈ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చేపురి రాణి రాజు, ఉపసర్పంచ్ వినోద్ గౌడ్, పిడిసి అధ్యక్షులు మద్ది సూర్యకాంత్ రెడ్డి, వార్డు సభ్యులు శశి కుమార్, పనాస రాజు, మన్నె కళ్యాణి రవి, వార్డు సభ్యుడు పైతరి సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.