calender_icon.png 10 January, 2026 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యానికే ప్రాధాన్యత: ఆవుల రాజిరెడ్డి

08-01-2026 01:33:38 AM

వెల్దుర్తి, జనవరి 7: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు బుధవారం వెల్దుర్తి మండలంలో పలు గ్రామాలకు చెందిన 12 మంది లబ్ధిదారులకు రూ.4లక్షల 8500 చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. అనారోగ్యాల బారిన ఆసుపత్రుల పాలైన బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఊరటనిస్తుందని తెలిపారు. పేద ప్రజలు సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉండాలని ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ అందుబాటులోకి తెచ్చారని వెల్లడించారు.