calender_icon.png 1 October, 2025 | 2:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలగిన రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు

01-10-2025 12:18:57 AM

విజయక్రాంతి కథనంతో కదలిన యంత్రాంగం

చారకొండ సెప్టెంబర్ 30 : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా చారకొండ మండల కేంద్రం తో పాటు వివిధ గ్రామాల్లో రాజకీయ పార్టీల ప్లెక్సీలు,

పోస్టర్లు తొలగించకపోవడంతో మంగళవారం విజయ క్రాంతిలో ‘ కోడ్ కూసినా తొలగని రాజకీయ పార్టీ ప్లెక్సీలు‘ శీర్షికన ప్రచురితమైన కథనానికి మంగళవారం అధికార యంత్రాంగం స్పందించి చారకొండ మండల కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన ప్లెక్సీలు, జెండాలు తొలగించి జెండా దిమ్మెలకు పెయింటింగ్ వేశారు.