01-10-2025 12:32:37 PM
సిద్దిపేట, (విజయక్రాంతి): సిద్దిపేట జిల్ల ఇమాంబాద్ గ్రామానికి చెందిన చతుర యాదవ్ సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో(Government Medical College) ఎంబీబీఎస్ సీటు సాధించి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తుల అభినందనలు అందుకున్నది. ముత్యాల తిరుపతి యాదవ్, తారక రత్నల కూతురు చతుర చిన్నప్పటినుంచి చదువులో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించేది దీంతో వారి తల్లిదండ్రులు హైదరాబాదులో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉచిత సీటు పొందడం పట్ల స్థానికులు అభినందిస్తున్నారు. మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ప్రత్యేకంగా అభినందించారు.