calender_icon.png 1 October, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక.. ముగ్గురు మంత్రులకు సీఎం సూచన

01-10-2025 01:08:35 PM

గెలుపు గుర్రాన్ని జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నిలబెట్టాలి.

హైదరాబాద్: మఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో(CM Revanth Reddy) పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(PCC Chief Mahesh Kumar Goud) బుధవారం నాడు భేటీ అయ్యారు. ఈ  సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక, నియోజకవర్గం పరిస్థితులపై చర్చించారు. కాగా, కాసేపటి క్రితమే రేవంత్ రెడ్డితో మహేష్ కుమార్ సమావేశం ముగిసింది. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై నివేదిక ఇవ్వాలని ముగ్గురు మంత్రులకు సీఎం సూచించారు. నివేదికలో పేర్లతో పాటు వారి వివరాలు ఉండేలా చూడాలని చెప్పారు. గెలుపు గుర్రాన్ని జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నిలబెట్టాలన్న కోణంలో నివేదిక ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. ఇన్ ఛార్జ్ మంత్రులతోపాటు ఎంపీల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. జడ్పీటీసీ అభ్యర్థులకు ముగ్గురు లెక్కన జాబితాలు సిద్ధం చేసి పీసీసీకి ఇవ్వాలని సీఎం ఆదేశించారు.