calender_icon.png 16 September, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి జిమ్మికులు ఆపండి..!

15-09-2025 11:32:40 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామ నాయకులు ఆదివారం నాడు బిఆర్ఎస్ పార్టీలో చేరికల్లో భాగంగా కడ్పల్ గ్రామానికి చెందిన తాజా మాజీ  సర్పంచ్ బాసి రెడ్డి గారి సంజీవరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ గాల్ రెడ్డి గారి శ్రీనివాస్ రెడ్డి, గాల్ రెడ్డి కిష్టారెడ్డిలు ఇరువురు నాయకులు ఆదివారం నాడు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వీరి చేరికలపై కడ్పల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు హన్మంతు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ...ఈ నాయకులు బిఆర్ఎస్ ఆవిర్భవించిన నుండి ఈరోజు వరకు బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు.

అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చెప్పిన మార్గంలో నడుస్తూ ఎంపీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీలోకి చేరి తిరిగి మరుసటి రోజు బిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగిందని, ఇప్పుడు కొత్తగా బిఆర్ఎస్ పార్టీలో చేరారని కండువా కప్పి ప్రచారాన్ని చేస్తున్న అంశంపై గ్రామ మండల ప్రజలు అందరూ హాస్య పరంగా మాట్లాడుకుంటున్నారని అన్నారు. ఇదంతా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి స్థానిక ఎన్నికల కోసమై ఇదంతా చేపడుతున్నారని కడ్పల్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు హన్మంతు అన్నారు. వారితో పాటు లొద్ద సాయిలు, బేతయ్య, రాంరెడ్డి, ఆనంద్ కుమార్, నారాయణ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆరోపించారు.