calender_icon.png 16 September, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ ఆస్పత్రికి నోటీస్ జారీ

16-09-2025 12:00:00 AM

  1. వైద్యం పేరుతో అధిక వసూళ్లపై ఆగ్రహం

ధరల పట్టికలను పొందుపరచాలని ఆదేశం

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో గల గాయత్రి హాస్పిటల్ కి వైద్యాధికారులు నోటీసులు జారీ చేశారు. వాతావరణంలో జరిగిన మార్పుల కారణంగా రోగుల తాకిడి పెరిగిన నేపథ్యంలో అదునుచూసి వైద్యం పేరుతో అత్యధిక డబ్బులు దండుకుంటున్న అంశంపై విజయక్రాంతి వరుస కథనాలను ప్రచురించింది.

ఈనెల 13న అమ్మో ఆసుపత్రి అనే శీర్షికతో పాటు ఈనెల 15న వైద్యం పేరుతో కాసుల దందా అనే శీర్షికన వరుస కథనాలను ప్రచురించగా సోమవారం జిల్లా వైద్యాధికారి రవికుమార్ సదురు ఆసుపత్రికి నోటీసులు జారీ చేశారు.

నేరుగా ఆయనే ఆకస్మికంగా సందర్శించి అత్యధిక డబ్బులు దండుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ధరల పట్టికల బోర్డులను, వైద్యుల పేర్లు బోర్డులను ప్రదర్శించాలని వాటికి అనుగుణంగానే డబ్బులు తీసుకోవాలన్నారు. అర్హత లేని వారి చేత వైద్యం చేయించరాదని హెచ్చరించారు.