16-09-2025 12:00:00 AM
గాంధారి సెప్టెంబర్ 15 (విజయ క్రాంతి): రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అని బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ జువ్వాడి శ్రీకాంత్ అన్నారు ఈ మేరకు సోమవారం రోజున ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు యూరియా దొరకక సొసైటీల ముందు అర్ధరాత్రి నుండే లైన్లలో యూరియా కోసం నిలబడి కాళ్లు పీకపోతున్న కళ్ళు కాయలు కాస్తున్న రైతులు యూరియా కోసం వేచి చూస్తున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏడ ఉన్నారో తెలంగాణ రైతాంగానికి సమాధానం చెప్పాలి ఒకవైపు *రాష్ట్ర రైతాంగం చేతికొచ్చిన పంటకు యూరియా చల్లుదామన్నా దొరకక అన్నమో రామచంద్రా అని ఎదురు చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం హైదరాబాదులోని వారి విల్లాలలో ఫామ్ హౌస్లలో జల్సాలు చేస్తా ఉన్నారు ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర మానుకొని రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ హెచ్చరిస్తున్నాం.