24 August, 2026 | 2:11 AM

ఖర్గేతో కొండా సురేఖ భేటీ

24-08-2026 01:30 AM
  1. రాష్ట్ర కాంగ్రెస్ పరిణామాలను వివరించిన మంత్రి
  2. కుమార్తె వ్యాఖ్యలపై వివరణ

హైదరాబాద్ ఆగస్టు 23 (విజయక్రాంతి): ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ ఆదివారం మంగళూరులో భేటీ అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో  పాటు తన కుమార్తె వ్యాఖ్యలపై ఖర్గేకు మంత్రి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీని, గాంధీ ఫ్యామిలీని విమర్శించలేదని.. తనపై  కుట్ర జరుగుతుందని చెప్పినట్లు తెలుస్తోంది.

కొండా సురే ఖపై ఖర్గే అసహనం వ్యక్తం చేశారని, ఏదైనా ఉం టే పీసీసీకి చెప్పాలని, పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించవద్దని సూచించినట్లు సమాచారం.   కాగా, లండన్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. పార్టీ నేతలతో సమావేశమై కొండా సురేఖ, చిన్నారెడ్డి, మేఘారెడ్డి వ్యవహారంపై చర్చించనున్నట్లు తెలిసింది.