calender_icon.png 13 August, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి రిమాండ్

12-08-2025 10:50:22 PM

మేడిపల్లి: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని రిమాండ్ చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కి చెందిన వెలిసెటి నాగరాజు పేద ప్రజలకు గవర్నమెంట్ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తానని నమ్మించి వాళ్ళ దగ్గరి నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి డబ్బులు తిరిగి ఇవ్వకుండా, ఇండ్లు ఇప్పించకుండా మోసం చేసినందుకు బాధితులు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కొని నాగరాజును రిమాండ్ కు తరలించడం జరిగిందని సీఐ గోవిందరెడ్డి తెలిపారు.