12-08-2025 10:53:46 PM
ఏపిఎం రాంబాబు..
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సెర్ప్ ఏపీఎం రాంబాబు(Serp APM Rambabu) అన్నారు. మండల కేంద్రం అర్వపల్లిలోని మండల సమాఖ్య కార్యాలయంలో మంగళవారం మహిళలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి కుటుంబం నుండి ప్రతి మహిళ సమభావన సంఘంలో సభ్యురాలుగా ఉండాలన్నారు. అదేవిధంగా వికలాంగుల సంఘాలు, వృద్ధుల సంఘాలు, కిషోర్ బాలికల సంఘాలు ఏర్పాటు చేసుకొని ఆయా సంఘాల ద్వారా శ్రీనిధి లోన్, సీఐఎఫ్ లోన్, ఇన్సూరెన్స్, ప్రమాద మరణాల ఇన్సూరెన్స్ లోన్ వంటి ప్రభుత్వ పథకాలను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘబంధం అధ్యక్షురాల్లు, వివిధ గ్రామాల వీఓఏలు తదితరులు పాల్గొన్నారు.