calender_icon.png 13 August, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలో హై అలర్ట్

12-08-2025 11:16:17 PM

రానున్న 72 గంటల పాటు జిల్లాకు భారీ వర్ష సూచన

వాతావరణ శాఖ హెచ్చరికలు

కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి

కొండాపూర్: కొండాపూర్ మండల పరిధిలోని అన్ని గ్రామాల లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని మంగళవారం కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి(SI Someswari) ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుండి బయటికి రాకూడదన్నారు. రానున్న 72 గంటల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, వాతావరణ శాఖ సూచించిందని, భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుండి బయటికి రాకూడదని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రమాద కారణాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అన్నారు.

జలాశయాలు చెరువులు, కుంటలను చూడడానికి వెళ్లకూడదని, జలాశయాలు నిండు కుండలా మారి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుందన్నారు. పొంగి పొర్లుతున్న వాగులను దాటడానికి ప్రయత్నించకూడదని అన్నారు. అత్యవసర సమయంలో డైల్ 100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712656739, కొండాపూర్ పోలీస్ స్టేషన్ 8712656748 ను సంప్రదించవలసిందిగా సూచించారు. రైతులు పొలాలో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలని, విద్యుత్ స్తంభాలను గాని, వైర్లను కానీ చేతులతో తాకకకూడదని హెచ్చరించారు. నీరు నిలువ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గర నుండి వెళ్లారాదని తెలిపారు. వాగులు వంకలు బ్రిడ్జ్ లపై నుండి పొంగి, పొరలే సమయంలో దాటాడానికి  ప్రయత్నించరాదన్నారు. పాడైన పాత భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల ప్రక్కన నివాసం ఉండరాదన్నారు.