calender_icon.png 13 August, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్నేహితునికి ఆర్థిక సాయం చేసిన తోటి స్నేహితులు

12-08-2025 10:29:29 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): తుంగతుర్తి మండల(Thungathurthi Mandal) కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2003-04 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన గోపగాని మహేష్ ఇటీవల అనారోగ్యానికి గురై పక్షవాతం రావడంతో మంగళవారం అతనితో చదువుకున్న తోటి స్నేహితులు అండగా నిలిచారు. ఈ మేరకు మహేష్ ను పరామర్శించి రూ.14 వేల ఆర్థిక సాయం అందించారు. మహేష్ కు ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు పాల్వాయి నగేష్, కొండగడుపుల మధుసూధన్, షేక్.యాకుబ్, రుద్ర సతీష్, కొండ సందీప్, కల్లూరి గణేష్, వడ్లకొండ సైదులు షేక్.నబీ, కస్తూరి గోపి, యట్టం నరేష్ తదితరులు పాల్గొన్నారు.