12-08-2025 10:45:16 PM
ప్రమాదమా.. ఆత్మహత్యనా..
అదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) తాంసి మండలంలో రైలు కిందపడి ఓ యువకుడు మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన గుమ్ముల నరేష్ అనే యువకుడు మద్యం మత్తులో మంగళవారం గ్రామ శివారులో రైలుకింద పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అయితే నరేష్ సూసైడ్ చేసుకున్నాడా, లేదా ప్రమదావశాత్తు ఈ ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. కాగా విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని రిమ్స్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.