calender_icon.png 26 October, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనభోజనాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

26-10-2025 06:29:33 PM

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని హెచ్ఎమ్టి శివాలయం దేవస్థానం వద్ద విఎంఆర్ కాపు సేవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనభోజనాలలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల వారు ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో వనభోజనాలకు వెళ్ళడం సంప్రదాయంగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విఎంఆర్ కాపు సేవ సమితి అధ్యక్షులు మూర్తి, కోటేశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట కోటేశ్వర్ రావు, మల్లారెడ్డి, ఎం ఎస్ వాసు, వెంకట రాఘవ రావు, ఉపాధ్యక్షులు నాగ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.