calender_icon.png 27 January, 2026 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

27-01-2026 12:29:44 AM

త్వరలో బీఆర్‌ఎస్‌లో చేరనున్న ఆరూరి రమేష్

హనుమకొండ టౌన్, జనవరి 26 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. వరంగల్ జిల్లా  పార్టీ కీలక నేత, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖలో తనకు సహకరించిన బీజేపీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

త్వరలో బీఆర్‌ఎస్ పార్టీ లో చేరనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. బీఆ ర్‌ఎస్ అధిష్టానం ఆహ్వా నం మేరకే పలువురు నాయకులు, అనుచరులు, అభిమానులతో కలిసి పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.