calender_icon.png 27 January, 2026 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదక్ పట్టణానికి 6 ఫ్రీజర్లు అందజేత

27-01-2026 12:30:39 AM

మాజీ డిప్యూటీ స్పీకర్,

బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి

మెదక్, జనవరి 26 (విజయ క్రాంతి): మెదక్ పట్టణ ప్రజల సౌకర్యార్థం కోసం మాజీమంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో ,బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఏం పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ లు 6 ఫ్రీజర్ లను అందజేశారు. ఇందులో ముస్లిం మైనార్టీలకు 2, క్రిస్టియన్ లకు 1, పట్టణంలోని ఇతర కులస్తులందరికీ 3 ఫ్రీజర్లను అంద చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ. గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మెదక్ మున్సిపల్ కు ఒక వైకుంఠ రథం,రెండు ఫ్రీజర్లు అందజేశానని గుర్తు చేశారు. ఫ్రీజర్ లు చెడిపోవడంతో మరమ్మతుకు నోచుకోక మూలన పడ్డాయి అన్నారు. ఫలితంగా మెదక్ పట్టణంలో ఎవరైనా చనిపోతే ఫ్రీజర్ దొరకని పరిస్థితి నెలకొందనీ చెప్పారు.

పట్టణంలో ఫ్రీజర్లు దొరికాక ప్రజల ఇబ్బందులను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే, తన్నీరు హరీష్ రావు గారి దృష్టికి తీసుక వెళ్లినట్లు చెప్పారు. వెంటనే స్పందించిన ఆయన మెదక్ పట్టణానికి 6 ఫ్రీజర్లు మంజూరు చేశారాని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు ఎవరైనా సరే అవసరం ఉన్నవాళ్లు ఫ్రీజర్లు తీసుకువెళ్లి వినియోగించుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఈ పంపిణి ఎన్నికల ప్రయోజనం కోసం కాదు. ప్రజల ఇబ్బందులను గుర్తించి పంపిణి చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో మండలాల వారిగా కూడా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు గారికి మాజీ ఎమ్మెల్సీ హుస్సేన్ గారికి పద్మ దేవేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్లు వంజరి జయరాజ్, సోహెల్, ఆర్కే శ్రీనివాస్, జ్యోతి కృష్ణ, నాయకులు సురేందర్ గౌడ్, జుబెర్ అహ్మద్, ఫాజిల్, షాకీర్, సాదిక్, సునీల్, సంతోష్,ఇమాదాడ్, ఇస్మాయిల్, శ్రీనివాస్,ఓమర్ ఫరూక్,మధు, అమీర్,కిరణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.