calender_icon.png 28 September, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాథ పిల్లలకు అండగా నిలుస్తున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్-దీవెన దంపతులు

28-09-2025 08:28:50 PM

చొప్పదండి (విజయక్రాంతి): తల్లిదండ్రులు చనిపోయి అనాధలుగా మారిన జిల్లాలోని పలువురికి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకర - దీవెన దంపతులు అండగా నిలుస్తున్నారు. గతంలోనే అనాధలకు సాయం అందించారు. ఆదివారం గంగాధర మండలం బూరుగుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తన నివాసంలో అనాథ పిల్లలకు బతుకమ్మ పండుగ సందర్భంగా బట్టలు పెట్టి, వారికి స్వయంగా భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు.

గతంలో చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ళ సమత, కెల్లేటి మానస, గంగాధర మండలం నారాయణపూర్ ఇస్తార్ పల్లి గ్రామానికి చెందిన కడమంచి అంజలి, శైలజ, ర్యాలపల్లి గ్రామానికి చెందిన రాజు, మనీషా, రామడుగు మండలం రుద్రారం గ్రామానికి గుర్రం నవిత, శంకరపట్నం మండలం ఏరడుపల్లి గ్రామానికి చెందిన, అభినయ, ఆలయ, చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామానికి చెందిన కొమ్ము నవదీప్ లకు బట్టలు పెట్టి, వారితో కలిసి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు.