28-09-2025 08:46:58 PM
ట్రాలీ ఢీకొని బాలుడు మృతి..
ముత్తారం (విజయక్రాంతి): ముత్తారంలో విషాదం నెలకొంది. మండల కేంద్రంలోని కాసర్ల గడ్డ బస్టాండ్ వద్ద ట్రాలీ ఢీకొని బాలుడు మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం కాసర్ల గడ్డ వద్ద టీ-షాపు నడుపుతున్న తిరునహరి శ్రీనివాస్-మంజుల కుమారుడు సిద్దార్థ(2) టీ షాప్ వద్ద ఉండగా అడవి శ్రీరాంపూర్ కు చెందిన ట్రాలీ ఆటో బాలుడిని ఢీకొనడంతో గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. కన్నకొడుకు కళ్ళ ముందే ట్రాలీ ఢీకొని మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. దీంతో ముత్తారంలో విషాదచాయలు నెలకొన్నాయి.