28-09-2025 08:37:24 PM
పట్టించుకోని అధికారులు
వనపర్తి (విజయక్రాంతి): కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ గోదాం రోడ్డు తీవ్రంగా పాడై ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోందని బీజేపీ నాయకుడు టీ. అమరేందర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటన ద్వారా అన్నారు. గతంలో వీవర్స్ కాలనీ ఏర్పాటుకు ఈ రహదారిని ఉపయోగించగా, తరువాత ప్రభుత్వ గోదాములకు మెటల్ రోడ్డు వేసి, బిటుమెన్ రోడ్డుకు టెండర్ కూడా పిలిచారని అయితే కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం కోర్టు కేసులు వేసి పనిని ఆపేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నక్షలో ఉన్న దారిని లేకపోయినట్టుగా చూపి కేసు ఎలా నమోదు అయ్యిందో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, దేవరకద్ర ఎమ్మెల్యే చొరవ చూపించి రోడ్డు పనులు పూర్తి చేసి రైతులు, కాలనీ వాసులు, గోదాం రవాణాకు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.