calender_icon.png 28 September, 2025 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు

28-09-2025 08:32:25 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్‌ రూరల్ మండలం నగునూర్‌లోని పరివార సమేత శ్రీ దుర్గాభవానీ ఆలయంలో దుర్గాభవానీ శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నవరాత్రులలో భాగంగా ఆరవ రోజైన ఆదివారం దుర్గాభవానీ అమ్మవారు రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధానార్చకులు పవనకష్ణ శర్మ అమ్మవారికి ప్రత్యేక హారతులిచ్చి చతుషష్ఠ్యుపచార పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని చీరేసారే పెట్టి ఓడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పూజల్లో ఆలయ ఫౌండర్‌ చైర్మెన్‌ వంగల లక్ష్మన్, ఆలయ కమిటి బాధ్యులు వేములవాడ ద్రోణాచారి, నీరుమల్ల తిరుపతి, మాజీ కార్పోరేటర్లు వంగళ శ్రీదేవి, అన్నప్రసాద ట్రస్టు బాధ్యులు రాచమల్ల ప్రసాద్, తొడుపునూరి వేణుగోపాల్, పల్లెర్ల శ్రీనివాస్, పడకంటి వినోద్, మోటూరి అంజనేయులు, భక్తులు పాల్గొన్నారు.