calender_icon.png 28 September, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మర్పల్లి మండలంలో భారీగా ఆశావాహులు

28-09-2025 08:41:28 PM

మర్పల్లి (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ఉత్కంఠకు తెరపడింది. జెడ్పీటీసీతో పాటు మండలంలోని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లు ఎట్ట కేలకు ఫైనల్ అయ్యాయి. రిజర్వేషన్లను బహిర్గత చేయగానే గ్రామాల్లో ఎన్నికల ఆశావహులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కోరుకున్నచోట కోరుకున్న విధంగా రిజర్వేషన్లు వచ్చినవారు సంబరపడుతుండగా తమకు అనుకూలంగా రిజర్వేషన్లు రానిచోట కొంతమంది నాయకులు నిరాశ చెందడం జరుగుతుంది.

పోటీలో ఉండే అభ్యర్థులంతా ఒక్కసారిగా తెరపైకి వచ్చేశారు. గ్రామాలలో తిరుగుతూ పోటీలో ఉంటామని సంకేతాన్ని ప్రజలకు ఇస్తున్నారు. జెడ్ పిటిసి బీసీ మహిళకు కేటాయించడంతో ఇప్పటి నుంచే ఆశావాహులు టికెట్ రేసులో ఉన్నారు. అలాగే ఎంపిపి కి కూడా బీసీ జనరల్ రిజర్వేషన్ వచ్చింది.  ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఉన్నవారు తమకే టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న వికారాబాద్ నియోజకవర్గంలో మర్పల్లి ఎంతో కీలకమైంది. ప్రస్తుత స్పీకర్ గతంలో ఎంపీపీగా ఇక్కడి నుంచే ప్రాతినిథ్యం వహించారు. టికెట్ రేసులో ఉన్నవారు పార్టీ పెద్దలతో ఇప్పటికే మంతనాలు మొదలుపెట్టారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సారి జెడ్పీటీసీ, ఎంపీపీ రెండు కూడా బీసీ రావడంతో బీసీ నేతల్లో ఎవరికి ఈ స్థానిలు వరిస్తానేది వేచి చూడాల్సి ఉంది