calender_icon.png 28 September, 2025 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రామిక మహిళల హక్కుల కోసం ఉద్యమించాలి

28-09-2025 08:52:30 PM

రాష్ట్ర కన్వీనర్ ఎస్ వి రమా..

నకిరేకల్ (విజయక్రాంతి): శ్రామిక మహిళలు తమ హక్కుల కోసం సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్ ఎస్ వి రమా పిలుపునిచ్చారు. ఆదివారం కట్టంగూరు మండల కేంద్రంలోనీ వైవిఆర్ ఫంక్షన్ హాల్ లో శ్రామిక మహిళ నల్లగొండ జిల్లా సదస్సు లకపాక భూలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ సమాజంలో సంపద సృష్టిలో శ్రామిక మహిళలు గణనీయమైన పాత్ర నిర్వహిస్తున్నారని అయినా వీరిని సమాజం ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కూడా మహిళల శ్రమను గుర్తించడంలో వారికి వేతనాలు ఇవ్వడంలో సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. పని ప్రదేశాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు వేయాలనున్న అమలు చేయడంలో యాజమాన్యాలు ప్రభుత్వం చేయకపోవడం అన్యాయమని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న వందేళ్ల నాటి కార్మిక చట్టాలను రద్దు చేసిందని వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ తేవడంతో కార్మిక హక్కులు కాలరాస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నికల ముంద ఇచ్చిన కార్మిక వర్గానికి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 5, 6 తేదీల్లో కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్లో జరగనున్న శ్రామిక మహిళ రాష్ట్ర కన్వెన్షన్ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ శ్రామిక మహిళా కన్వీనర్ ఎం ప్రమీల జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం సహాయ కార్యదర్శి చింతపల్లి బయన్న జిల్లా కమిటీ సభ్యులు పెంజర్ల  సైదులు, సుధీర్ రవీందర్ సత్యనారాయణ లకపాక రాజు, వెంకటమ్మ, జానకి, ఏదుల సునీత, బొందుపార్వతి, పొడిశెట్టి నాగమణి, మంత్రాల మంగమ్మ, బోయపల్లి చంద్రమ్మ, మిరియాల శ్రీవాణి కత్తుల పద్మ, దాడి అరుణ పార్వతమ్మ పెరిక కళావతి తదితరులు పాల్గొన్నారు