calender_icon.png 17 November, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

17-11-2025 12:00:00 AM

బిచ్కుంద, నవంబర్ 16 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బండపల్లి గ్రామానికి చెందిన BRS మాజీ ఉప సర్పంచ్ బద్ది రాజు గత వారం  గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకొని, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే  ఆదివారం బండపల్లి గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.వారి కుటుంబ సభ్యులతో మాటలాడి ధైర్యం చెప్పారు, బి.ఆర్.ఎస్ పార్టీ ఎల్లవేళలా మీ కుటుంబానికి అండగా ఉంటుంది అన్నారు.

ఈ కష్టసమయంలో దేవుడు శక్తి, సహనం ప్రసాదించాలని ప్రార్థించారు. బద్ది రాజు  సేవలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పిట్లం మాజీ ఎంపీపీ రజినీకాంత్ రెడ్డి, గుంటి రాములు, బర్షం శ్రీకాంత్, సొసైటీ రాములు, కుమ్మరి తుకారాం, కొంగల చిన్న సాయిలు, గొల్ల అంజయ్య, సురేష్ బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.