calender_icon.png 17 November, 2025 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

17-11-2025 12:00:00 AM

తాడ్వాయి, నవంబర్ 16, (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామానికి చెందిన చెట్టే సతీష్ (29) అనే యువకుడు శుక్రవారం గడ్డి మందు తాగి ఆత్మహాత్య చేసుకొన్నట్లు ఎస్త్స్ర నరేష్ తెలిపారు. సతీష్ ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మ హత్య చేసుకొన్నట్లు ఆయన వివరించారు. గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న విషయాన్ని గమనించిన  కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సతీష్ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు ఆయన తెలిపారు ఈ విషయమై భార్య లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం సతీష్ అంత్యక్రియలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్మోహన్ పాల్గొని ఆయన పాడే మోశారు. సతీష్ పార్టీకి అందించిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు.