calender_icon.png 17 November, 2025 | 1:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవత్వం చాటిన ఎమ్మెల్యే

17-11-2025 12:00:00 AM

కామారెడ్డి, నవంబర్ 16 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో 44 జాతీయ రహదారిపై ఆదివారం హోటల్ దగ్గర గుర్తు తెలియని వాహనం బైకును డికొట్టింది. బైక్ పై వెళ్తున్న వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు.

దోమకొండలో కార్యక్రమాలు ముగించుకొని తిరిగి వస్తున్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గమనించి తన వాహనాన్ని ఆపి గాయపడిన క్షత గాత్రుడునీ పరామర్శించారు. అనంతరం గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారని స్థానికులు తెలిపారు.