calender_icon.png 15 December, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన సర్పంచులకు సన్మానం చేసిన మాజీ ఎమ్మెల్యే, జడ్పీటీసీ

15-12-2025 08:12:10 PM

నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): రెండో విడత స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన ధర్మారెడ్డి గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ, వాడి, గ్రామ సర్పంచ్ మహేందర్ గోపాల్పేట్ గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్లను, వార్డు సభ్యులను మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, మాజీ జడ్పీటీసీ ఉమన్నగారి మనోహర్ రెడ్డిలు కలిసి ఘనంగా కాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ మాట్లాడుతూ... తమ విజయానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యేలు జనార్దన్ గౌడ్, నల్లమడుగు సురేందర్లకు గ్రామస్తులకు, నాయకులకు, కార్యకర్తలకు, వార్డు మెంబర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

స్థానిక మండల కేంద్రంలోని గోపాల్పేటలో పోటాపోటీగా భారీ మెజార్టీతో వంశీకృష్ణ గౌడ్ గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. గ్రామ ప్రజలకు ఇలాగే మరిన్ని సేవలు అందించి మరెన్నో పదవులు చేరుకోవాలని తెలిపారు. రానున్న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మరిన్ని విజయాలను సాధించి కేసీఆర్ కు కానుకగా ఇద్దామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు లక్ష్మీనారాయణ, వంశీకృష్ణ గౌడ్, మహేందర్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య, వార్డ్ మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.