calender_icon.png 15 December, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ

15-12-2025 08:21:44 PM

తానూర్ (విజయక్రాంతి): మండలంలోని బెంబర్ గ్రామంలో అన్నపూర్ణ క్షేత్ర ఆలయ అర్చకుడు మంత్రి సాయినాథ్ గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించారు. కలిసి సామూహిక పడిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండలంలోని స్వాములు భైంసా ముధోల్ గ్రామాలకు చెందిన పెద్ద సంఖ్యలో అయ్యప్ప దీక్షాపరులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామికి అభిషేకం ఘనంగా చేశారు. అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు ఆయాగ్రాముల ప్రజలు గ్రామస్తులు పాల్గొన్నారు.