13 June, 2026 | 2:46 PM

Breaking News

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మంత్రి తుమ్మల ఇంటికి సిట్   •   జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్   •   సంగారెడ్డి జిల్లాలో ఆరు నెలల గర్భిణి ఆత్మహత్య   •   అమెరికా దాడులను తప్పుబట్టిన భారత్   •   ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు   •   బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు   •   మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్   •   గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్   •   తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఒక్కనాడైనా పాల్గొన్నారా?: KTR   •   భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా ఉండండి.. క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచన   •  

ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు

13-06-2026 01:45 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): యాదవ రాజ్యాధికార సాధన సమితి జిల్లా అధ్యక్షుడు ఉప్పుల నాగమల్లు యాదవ్ఆధ్వర్యంలో శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కేక్ కట్ చేసి మిఠాయి పంచుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.... లింగయ్య యాదవ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, నాయకులు గుండగాని రాములు గౌడ్, గోపగాని రమేష్ గౌడ్, గోపగాని శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ లకావత్ యాకు నాయక్, నల్లబెల్లి వెంకటేష్, బొజ్జ సాయికిరణ్, కొండగడుపుల వెంకటేష్, తడకమళ్ళ మల్లికార్జున్, పోలేపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.