13 June, 2026 | 2:46 PM

Breaking News

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మంత్రి తుమ్మల ఇంటికి సిట్   •   జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్   •   సంగారెడ్డి జిల్లాలో ఆరు నెలల గర్భిణి ఆత్మహత్య   •   అమెరికా దాడులను తప్పుబట్టిన భారత్   •   ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు   •   బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు   •   మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్   •   గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్   •   తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఒక్కనాడైనా పాల్గొన్నారా?: KTR   •   భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా ఉండండి.. క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచన   •  

బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు

13-06-2026 01:43 PM

బోథ్, జూన్ 13(విజయక్రాంతి): పార్టీ తనపై నమ్మకంతో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షునిగా నియమించడం వల్ల తనపై మరింత బాధ్యత పెరిగిందని నూతనంగా ఓబీసీ జిల్లా అధ్యక్షునిగా నియామకం అయిన దక్షిణ మధ్య రైల్వే బోర్డు మాజీ సభ్యులు జివి రమణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన విజయ క్రాంతి తో మాట్లాడుతూ సమీప భవిష్యత్తులో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ సత్తా చూపిస్తుందన్నారు. గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీకి పట్టుకొమ్మలాంటి కార్యకర్తలు ఉన్నారని వారి సహకారంతో జిల్లాలో భారతీయ జనతా పార్టీ జెండా ఎంపీటీసీ జెడ్పిటిసి లలో ఎగురవేస్తామన్నారు. బోత్ నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉందన్నారు అదిలాబాద్ జిల్లాలో బిజెపి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచే విధంగా కార్యకర్తలను సన్నద్ధం చేస్తామన్నారు.