calender_icon.png 8 July, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎంపీపీ బుగ్గయ్యగౌడ్ సేవలు చిరస్మరణీయం

08-07-2025 01:08:57 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 

కడ్తాల,జులై 7 : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, దివంగత మాజీ ఎంపీపీ బుగ్గయ్య గౌడ్ ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం కడ్తాల్ మండలంలోని ఎక్వాయిపల్లి గ్రామంలో బుగ్గయ్య గౌడ్ నాలుగో వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ నాయ కునిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. కుటుంబ సభ్యులు మాజీ ఎంపిటిసి పాలకూర్ల ఉమావతి, కుమారులు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రవికాంత్ గౌడ్ కర్ణాకర్ గౌడ్ లను పరామర్శించారు. కుటుంబ పెద్ద దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో తాను అర్థం చేసుకోగలనని మీరు అధైర్య పడోద్దని రాజకీయంగా అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని ఆ యన హామీనిచ్చారు.

తండ్రి స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజాసేవలో కుటుంబం నిమగ్నం కావాలన్నారు. బుగ్గయ్య గౌడ్ లేని లోటు గ్రామానికి, పార్టీ కే కాక వ్యక్తిగతంగా తనకు తీరని లోటు గా ఉందని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాసేవలో ప్రతి ఒక్కరూ బుగ్గయ్య గౌడ్ ను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పిసిసి మెంబర్ ఆయిల్ శ్రీ నివాస్ గౌడ్,మాజీ ఎంపీటీసీలు శ్రీనివాస్ రెడ్డి,చేగురి వెంకటేష్,మాజీ సర్పంచ్ యాట నరసింహ, కాంగ్రెస్ నాయకులు రమేష్, బాబు, శంకర్,చంద్రయ్యలు పాల్గొన్నారు.