08-07-2025 01:09:43 AM
- బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్, జూలై ౭ (విజయక్రాంతి): లక్ష్మణ్ చందా మండలం బోరీగావ్ గ్రామంలో బస్టాండ్ వెనక గల 3 ఎకరాల ప్రభుత్వ భూమిలో పల్లె ప్రకృతి వనంకు కేటాయించగా, కొందరు అధికార పార్టీకి చెందిన వ్యక్తులు రాత్రికి రాత్రి ప్రకృతి వనంలోని చెట్లను తొలగించి, కబ్జాకు పాల్పడ్డారు.
విషయం తెలుసుకున్న బీజేఎల్పీ నేత ఎమ్మె ల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సోమవారం ఘట నా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అధికారులను ఆదేశించి కబ్జాకు పాల్పడ్డ వ్యక్తు లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించా రు. అంతకుముందు నిర్మల్ సారంగాపూర్ లక్ష్మణ్ చందా మండల కేంద్రంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
వివిధ గ్రామాల్లో పాఠశాలలు సందర్శించి మౌలిక సదుపాయాల కల్పన పై అధికారులకు సూచనలు చేశారు వివిధ పాఠశాలలో మొక్కలు నాటా రు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి సీనియర్ నాయకులు సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.