08-07-2025 12:36:55 AM
- సాయిసూర్య డెవలపర్స్ కేసులో వినియోగదారుల కమిషన్ జారీ
- మహేశ్ ఫొటో చూసే ప్లాట్ కొనేందుకు డబ్బులు చెల్లించామని బాధితురాలి ఫిర్యాదు
-ఇదే కేసులో ఏప్రిల్‌లోనూ ఈడీ నుంచి ఆయనకు నోటీసులు..
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7 (విజయక్రాంతి): వివాదాస్పద రియల్ ఎస్టేట్ సంస్థ సాయిసూర్య డెవలపర్స్‌కు సంబంధించిన కేసులో సినీనటుడు మహేశ్‌బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం నోటీసులు అందిం చింది. ఇప్పటికే ఇదే సంస్థకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నుంచి కూడా మహేశ్‌బాబు నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే.
సంస్థ బ్రోచర్‌లో మహేశ్‌బాబు ఫొటో చూసి మోసపోయామంటూ ఓ బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఫోరం, ఈ కేసులో మహేశ్‌ను మూడో ప్రతివాదిగా చేరుస్తూ నోటీ సులు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యురాలు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరంలో సాయిసూర్య డెవలపర్స్‌పై ఫిర్యాదు చేశారు.
ఆ సంస్థ ప్రచార బ్రోచర్ లో సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఫొటో ఉం డటంతో నమ్మకం కుదిరి, బాలాపూర్ పరిధిలోని ఓ వెంచర్‌లో ప్లాట్ కొనుగోలు చేసేం దుకు రూ. 34.80 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. విచారిస్తే ఆ లేఅవుట్‌కు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని, అదొక మోసపూరిత వెంచర్ అని తెలిసిందని ఆమె ఆవే దన వ్యక్తం చేశారు.
కట్టిన డబ్బును తిరిగి ఇవ్వాలని సంస్థ ఎండీ సతీశ్ చంద్రగుప్తాని నిలదీయగా, కేవలం రూ.15లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చి చేతులు దులుపుకున్నారని బాధితురాలు ఆరోపించారు. మహేశ్‌బాబు వం టి ప్రముఖ నటుడు ప్రచారం చేయడం వల్లే తాము ఆ సంస్థను విశ్వసించి మోసపోయామని, కాబట్టి ఈ మోసంలో ఆయన బాధ్యత కూడా ఉందని పేర్కొంటూ తన పిటిషన్‌లో మహేశ్‌ను మూడో ప్రతివాదిగా చేర్చారు.
గతంలోనూ ఈడీ నోటీసులు..
ఇదే సాయిసూర్య డెవలపర్స్ సంస్థపై నమోదైన మనీలాండరింగ్ కేసులో భాగం గా, 2025 ఏప్రిల్‌లోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ మహేశ్‌బాబుకు నోటీసులు జారీ చేసింది. బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినందుకు గాను ఆయన ఆ సంస్థ నుంచి రూ. 5.9కోట్లు పారితోషికంగా తీసుకున్నట్లు ఈడీ విచారణలో గుర్తించింది. తాజాగా వినియోగదారుల ఫోరం కూడా నోటీసులు జారీ చేసి, సోమవారం న్యాయవాదితో సహా ఫోరం ఎదుట హాజరు కావా లని ఆదేశించింది.